![]() |
![]() |
కొన్ని డైలాగ్స్ ఎలా ఉంటాయంటే గుండె టక్కున ఆగిపోయేలా ఉంటాయి. ఇంతకు ఎదుటి వాళ్ళు ఎం అడిగార్రా నాయనా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నటుడు, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఆదిత్య ఓం పరిస్థితి కూడా అలాగే ఉంది. దావత్ ఇంటర్వ్యూకి వెళ్లిన హీరో ఆదిత్య ఓంని హోస్ట్ ఆరియానా ఒక విషయం అడిగింది. దానికి ఆయన గుండె పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకు ఆరియానా ఎం అడిగింది అంటే "నేను మీ దగ్గర నుంచి ఒక ముద్దును అప్పుగా తీసుకోవచ్చా...తర్వాత తిరిగిచ్చేస్తాను" అంటూ రొమాంటిక్ డైలాగ్ ని చెప్పేసరికి ఆదిత్య ఓం ఎదురు చూడని ఆ ప్రశ్నకు షాకై గుండె పట్టేసుకున్నాడు. ఐతే ఆరియానా తొందరపడి "మీరెలాగూ ఇవ్వడం లేదు ముద్దు నేనే వచ్చి తీసుకుంటా" అని సీట్ లోంచి లేచేసరికి ఆదిత్య ఓం చాలా భయపడిపోయి వద్దు అంటూ నోరెళ్లబెట్టేసాడు. కానీ ఆరియానా వెళ్లి అతని పక్కన కూర్చునేసరికి ఆదిత్య హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అంటే ఫేక్..ఇక్కడ ఉండేది కమర్షియల్ రిలేషన్ షిప్స్ , కమర్షియల్ పార్టనర్ షిప్స్ అంటూ టాలీవుడ్ మీద ఒక పెద్ద డైలాగ్ వేసేశాడు. 2002లో లాహిరి లాహిరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ మూవీ తర్వాత అతనికి చెప్పకోగదగ్గ హిట్ రాలేదు. ఆయన తండ్రి ఐఏఎస్.. తల్లి సమాజ్‌వాదీ పార్టీలో కీలక నాయకురాలు. ఆదిత్య ఓంది ఎంత గొప్ప మనసు అంటే తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిని దత్తత తీసుకుని అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
![]() |
![]() |